బ్రిటన్ దేశంపై ఉగ్రదాడి ఉలిక్కిపడేలా చేసింది. యూదుల క్యాలెండర్ లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున మాంచెస్టర్ లోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగోగ్ పై ఉగ్రవాద దాడి(Terrorist attack) జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. యోమ్ కిప్పూర్ పవిత్ర దినోత్సవం రోజున జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. 35 ఏళ్ల జిహాద్ అల్-షమీగా పోలీసులు గుర్తించారు.
Read Also: Apple Watch:స్కూబా ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్

ఇది ఉగ్రవాద చర్య: పోలీసులు
గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు మొదట దీనిని ఒక పెద్ద ప్రమాదంగా అభివర్ణించారు. అయితే కౌంటర్-టెర్రరిజం కమాండ్ తరువాత దీనిని ఉగ్రవాద సంఘటనగా ప్రకటించింది. భద్రతా సిబ్బందితో సహా అనేక మంది కత్తులతో చేసిన దాడిలో గాయపడ్డారు. మరికొందరు వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. పోలీసులు ఆపరేషన్ ప్లేటోను అమలు చేసి బాంబు స్క్వాడ్ ను సంఘటనా వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు.
ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయం తెలిసి మొదట తాను షాక్ కు గురయ్యానని..ఈ దుర్ఘటనకు బాధపడ్డానని చెప్పారు. యూదుల రక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనామందిరాల(Houses of worship) వద్ద అదనపు భద్రతా దళాలను మోహరించారు.
సంతాపం తెలిపిన బ్రిటన్ రాజు, రాణి
బకింగ్ హామ్ ప్యాలెస్ కింగ్ చార్లెస్..క్వీన్ కెమిల్లా తరపున సంతాపం తెలిపారు. ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. స్థానిక మేయర్ ఆండీ బరమ్ ఈ దాడిని ఖండించారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ ఘటన జరగడం తీవ్ర విచారకరమని పేర్కొంది.
యూదుల ప్రార్థనామందిరంపై ఉగ్రదాడి ఎక్కడ జరిగింది?
మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగోగ్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ దాడిలో ఎన్ని మంది ప్రాణాలు కోల్పోయారు?
ఇద్దరు వ్యక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: