థాయ్‌ల్యాండ్, కంబోడియా (Thailand, Cambodia Temples) సరిహద్దులోని ప్రాచీన ఆలయాల వద్ద మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. తా మోన్ థోమ్, తా క్రబే ఆలయాల వద్ద (At the temples of Ta Mon Thom and Ta Krabe) ఈ సాయంత్రం తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆలయాలపై నియంత్రణ సాధించేందుకు థాయ్ ఆర్మీ ప్రయత్నిస్తుండగా, కంబోడియా మాత్రం గట్టిగా ఎదురు తిరుగుతోంది.తా మోన్ థోమ్, తా క్రబే ఆలయాల్ని తమవిగా ప్రకటించేందుకు థాయ్‌ల్యాండ్ ప్రయత్నిస్తోందని కంబోడియా ఆరోపిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత థాయ్ బలగాలు దాడులు ముమ్మరం చేశాయని తెలిపింది. ఆలయాల చుట్టూ సైనికులు మోహరించారని, మందుగుండు సామాగ్రి అక్కడ చేరిందని కంబోడియా వెల్లడించింది.
ఫైరింగ్-షెల్లింగ్‌తో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు
ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఫైరింగ్ నమోదైంది. ఆలయాల చుట్టూ భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. కంబోడియాలోని ప్రిహే వియార్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో షెల్లింగ్ కొనసాగుతోంది. అక్కడి ప్రజలు భయంతో ఇంట్లోనే దాక్కున్నారు.
కంబోడియా బలగాల ప్రతిస్పందన – గట్టి బదులు ఇచ్చామంటూ స్పష్టం
థాయ్ బలగాల దాడికి తమ బలగాలు సమర్థంగా ప్రతిదాడి చేశాయని కంబోడియా స్పష్టం చేసింది. ఆలయాల్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొంది. శాంతి భద్రతల్ని భంగపెట్టే పనులకు తాము సహకరించమని తేల్చిచెప్పింది.
ప్రాచీన ఆలయాలు… అంతర్జాతీయంగా చర్చకు కేంద్రబిందువయ్యే అవకాశముంది
తా మోన్ థోమ్, తా క్రబే ఆలయాలు చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నవే. ఇవి సాంస్కృతికంగా కూడా విలువైనవిగా గుర్తింపు పొందినవి. ఇప్పుడు వీటిపై సైనిక చర్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ అంశం చర్చకు మారింది. యుద్ధం కాకుండా శాంతియుత పరిష్కారం కావాలన్నదే ప్రజల కోరిక.
Read Also : Cambodian Defense Ministry : శివాలయాలపై బాంబులు : కంబోడియా రక్షణశాఖ