War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధాలను మరింత పెంచుతానని కిమ్ హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పు ఎదుర్కొనే భాగంలో అమెరికా, దక్షిణ కొరియా బలగాలు వార్షిక విన్యాసాలను ప్రారంభించాయి. ఆగస్టు 18న ఇవి మొదలయ్యాయి. దాదాపు 11రోజులుగా ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి. సియోల్ కు చెందిన 18వేల మందితో పాటూ మొత్తం 21వేలమంది సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఆయుధ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకుంటున్న ఉ.కొరియా
తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన చో హ్యోన్ యుద్ధ నౌక అధ్యక్షుడు కిమ్(Kim) పరిశీలించారు. శత్రువులు యుద్ధాన్ని ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని.. వాటికి ధీటుగా సమాధానమిస్తామని కిమ్ తీవ్రంగా హెచ్చరించారు. శత్రువులు యుద్ధాన్ని ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని, వారికి ధీటుగా సమాధానమిస్తామని కిమ్ పేర్కొన్నారు. తమ అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటామని చెప్పారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న గొడవలు
1945లో ఉత్తర, దక్షిణ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. రెండు దేశాలకు మధ్య గొడవలకు ఇదే ప్రధాన కారణం. దాంతోపాటు 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా సోవియట్(Soviet) మద్దతుతో దక్షిణ కొరియాపై దాడి చేసింది.
మూడేళ్లపాటు ఇది జరిగింది. అనేకులు మరణించారు. కాల్పుల విరమణ జరిగినప్పటికీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం మాత్రం కుదరడం లేదు.

ఉ.కొరియా క్షిపణి పరీక్షలతో మళ్లీ పెరుగుతున్న వివాదాలు
ఉ.కొరియా అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు ద.కొరియాతోపాటు ఇతరదేశాలకు వివాదాలకు ప్రధాన కారణం. ఉత్తర కొరియాలో మానవ హకు్కల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఉత్తర కొరియాపై విధించిన
అంతర్జాతీయ అంక్షలు వివాదాలు పెరిగేందుకు కారణంగా ఉంది. అంతేకాకుండా ఉత్తర కొరియా తరచుగా స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగిస్తుండడంతో దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ ఉద్రిక్తతల ప్రభావం ఏంటి?
దక్షిణ కొరియా మాత్రమే కాకుండా జపాన్, అమెరికా వంటి దేశాలు కూడా భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా శాంతి, భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: