America: రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచదేశాలపై అధిక సుంకాలు వసూలు చేస్తూ, వాణిజ్యయుద్ధానికి దిగుతున్నారు. ట్రంప్ విధానాలపై సొంతదేశస్తులే విమర్శిస్తున్నారు. భారత్కు అమెరికా నీతులు చెబుతుండటం అనేది ఏనుగును ఎలుక పిడికిలితో గుద్దినట్టుగా ఉందని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ ఉల్ఫ్ అభివర్ణించారు. భూమిపై అతిపెద్ద దేశం భారత్అన్న విషయాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత కర్కశమైన వ్యక్తిలా భారత్ తో అమెరికా ప్రవర్తిస్తోందని, దీంతో తనపై తానే గాయాలు చేసుకుని బాధపడేవ్యక్తిలా ట్రంప్ ఉన్నారని ఆయన అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా ఆపేందుకు ఒత్తిడి చేస్తున్నా దాన్ని ఆపలేమని భారత్ తేల్చి చెప్పడం అనేది ప్రపంచ దేశాల శక్తుల్లో వచ్చిన మార్పుకు అద్దంపడుతోందన్నారు. రష్యా టుడేకు శుక్రవారం అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ ఉల్ఫ్ మాట్లాడుతూ పై వ్యాఖ్యల్ని చేశారు.

భారత్ ఇతర మార్కెట్లను అన్వేషిస్తుంది
అమెరికా తలుపులను మూసేస్తే, వస్తు, సేవలను విక్రయించుకునేందుకు ఇతర దేశాల మార్కెట్లను భారత్ వెతుక్కుంటుందని రిచర్డ్ ఉల్ఫ్(Richard Wolf) తెలిపారు. చమురును అమ్ముకునేందుకు ఇతరత్రా మార్కెట్లను రష్యా ఎలాగైతే సిద్ధం చేసుకుందో, భారత్ కూడా అలాగే ఇతరత్రా మార్కెట్లను రెడీ చేసుకోగలదన్నారు. ఈ పరిణామాల ఫలితంగా కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35శాతం దాకా ఉందని, జీ7 దేశాల జీడీపీ వాటి 28శాతమేని రిచర్డ్ ఉల్ఫ్ గుర్తు చేశారు. ట్రంప్ నిర్ణయాలను చూస్తుంటే బ్రిక్స్న మరింత పెద్దగా, విజయవంతంగా చేయాలనే ప్లాన్లో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.
అప్పులతో అమెరికా సతమతం
ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తు, సేవలను చౌకగా తయారు చేస్తున్న కంపెనీలు అమెరికాకు షిప్ట్ అయ్యే అవకాశమే లేదు. ఆ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ట్రంప్ సర్కారు అమెరికాలో కొత్త ఉద్యోగాలను కల్పించలేకపోతోంది. అమెరికా ప్రభుత్వం సుంకాల బాదుడు వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్క్ను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే ముప్పు ఉంది. ఇప్పటికే అమెరికాకు 36ట్రిలియన్ డాలర్ల దాకా అప్పులు ఉన్నాయి. ఇదొక బలహీన అంశం. అమెరికా ట్రెజరీలలో తమ వాటాలను చైనా లాంటి దేశాలు క్రమంగా తగ్గిస్తున్నాయి. దీంతో విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనే పెద్ద ప్రశ్న ఉదయిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం బాగా పెరిగిపోతుంది. తద్వారా ప్రపంచపటంలో అమెరికా స్థానం బలహీనపడుతుంది’ అని రిచర్డ్ ఉల్ఫ్ పేర్కొన్నారు.
రిచర్డ్ ఉల్ఫ్ ఎవరు?
రిచర్డ్ ఉల్ఫ్ ఒక ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై తరచుగా విశ్లేషణలు చేస్తారు.
ట్రంప్ భారత్‌పై ఏ విధమైన ఒత్తిడి చేస్తున్నారు?
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: