Trump: ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సులో(Quad Summit) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. మొదట ఆయన పాల్గొంటారని సమాచారం వెలువడినా, భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సమస్యల కారణంగా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

మోదీ–చైనా పర్యటనపై అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చైనా పర్యటన చేయడం ట్రంప్‌కు నచ్చలేదని, దీంతో ఆయన భారత్ పర్యటనపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత రాకపోవడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ పలుమార్లు మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, మోదీ స్పందించలేదని కూడా పేర్కొన్నారు.
భారత్–అమెరికా సంబంధాల్లో మార్పు?
భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ పలు మార్లు వ్యాఖ్యానించడం, అదనపు సుంకాలు(Tariffs) విధించడం మోదీకి అసంతృప్తిని కలిగించిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో భారత్ అమెరికాకు దూరమవుతూ, చైనాతో దగ్గర అవుతోందని నివేదికలో వెల్లడించింది. అమెరికా టారిఫ్‌లను పట్టించుకోకుండా మోదీ చైనాను సందర్శించడంతో ట్రంప్ కూడా తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
క్వాడ్ సదస్సు ఎక్కడ జరగనుంది?
క్వాడ్ సదస్సు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనుంది.
ట్రంప్ ఎందుకు రాకుండా నిర్ణయించుకున్నాడు?
భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఉద్రిక్తతలు, మోదీ చైనా పర్యటనపై ట్రంప్ అసంతృప్తి కారణంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: