Trump: ప్రముఖ టెక్ సంస్థల సీఈవోలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థల సీఈవోలు హాజరయ్యారు. ఈ ప్రత్యేక విందులో ఎలాన్ మస్క్ ఎక్కడా కనిపించలేదు. దీంతో మస్కు ఇంత అవమానం చేస్తారా ట్రంప్ అంటూ నెటిజన్లు వాపోతున్నారు. ట్రంప్కు మస్క్ సన్నిహితుడు, అతడి గెలుపులో మస్క్ ముఖ్యపాత్రవహించాడని, ఇంతటి వ్యక్తిని ట్రంప్ ఆహ్వానించకపోవడంతో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
హాజరైన ప్రముఖులు
ఈ ప్రత్యేక విందులో మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్జటమన్, బ్లూ ఆరిజిన్ సీఈవో డేవిడ్ లింప్, ఒరాకల్ సీఈవో సఫ్రా కాట్జ్ పలువురు హాజరయ్యారు. కానీ మస్ హాజరు కాకపోవడంతో స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులుగా మారినట్లు తెలుస్తోంది. బహిరంగంగా ఇలా స్నేహితుడిని పిలవకపోవడంతో ట్రంప్పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ట్రంప్ పిలిచారని, కాకపోతే కుదరక తాను వెళ్లలేదని మస్క్ తెలిపారు.

ఒకరిపై ఒకరు విమర్శలు
కాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచన తర్వాత మస్కు కేబినెట్లో కీలక డోజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని రోజులకే వారి మధ్య గొడవలు వచ్చాయి. ఓ బిల్లు విషయంలో గొడవలు జరిగి మిత్రులుగా ఉన్న వీరు శత్రువులుగా మారారు. పబ్లిక్ లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వీరిమధ్య గొడవలు సోషల్ మీడియాలో(Social Media) హల్చెల్ చేశాయి. ఈ విందులో ట్రంప్ యాపిల్ కంపెనీ ఇండియా పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు సీఈవో టిమ్ కుకన్ను పరోక్షంగా బెదిరించినట్లు సమాచారం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఇండియా అమెరికాల మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో విభేదిస్తున్న భారత్ ప్రస్తుతం చైనా, రష్యాలతో స్నేహసంబంధాలను పెంచుకుంటోంది.
ఎలన్ మస్క్‌కు ఆహ్వానం ఎందుకు అందలేదు?
ఎలన్ మస్క్ రాజకీయంగా తరచుగా తన అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గడం వల్ల ట్రంప్ మస్క్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మస్క్‌ను ఆహ్వానించలేదని వార్తలు వచ్చాయి.
ఈ విందులో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి?
ట్రంప్ టెక్ కంపెనీల నుండి ఎన్నికల నిధులు, సాంకేతిక సహకారం, AI నియంత్రణ మరియు చైనాకు సంబంధించిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Read also: