हिन्दी | Epaper
చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

Telugu News:Trump Tariff- భారత్ పై నోరు పారేసుకుంటున్న అమెరికా అధికారులు

Pooja
Telugu News:Trump Tariff- భారత్ పై నోరు పారేసుకుంటున్న అమెరికా అధికారులు

Tariff-భారతదేశంపై అమెరికా చాలా అసహనంగా ప్రవర్తిస్తోంది. చీటికీమాటాకీ ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కుకుంటున్నది. నిత్యం ఏదో ఒక విషయంలో భారత్ ను తక్కువగా చేసి మాట్లాడడం అమెరికాకు మాములైపోయింది. తాజాగా యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ ‘ఒకటి రెండు నెలలో భారత్ అమెరికాకు క్షమాపణలు చెబుతందని’ అన్నారు. అంతేకాదు వాళ్లు (భారత్) అమెరికాను క్షమించమని అడిగి..ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారని అన్నారు. అలా చేయకపోతే ఆ దేశం 50శాతం సుంకాలను భరించాల్సి వస్తుందని బెదిరించారు. అతి పెద్ద క్లయింట్ తో పోరాటం కొన్నిసార్లు గొప్పగా అనిపిస్తుందని లుట్కిన్ (Lutkin)చెప్పుకొచ్చారు. అయితే ఎక్కువ రోజులు కొనసాగదు చివరకు అమెరికా ఒప్పందాలను ఒప్పుకోవాల్సిందేనని అని పేర్కొన్నారు.

Trump Tariff

తమకేమీ అభ్యంతరం లేదంటూనే అక్కసు..

రష్యా, చైనాలతో భారతదేశం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ అమెరికా డాలర్ గానీ, యూఎస్ కుగానీ మద్దతు తెలపాల్సిందేనని హోవార్డ్ లుట్కిన్ అన్నారు. అలా లేకపోతే మాత్రం 50శాతం టారిఫ్ లను భరించాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్ వైఖరి ఎన్నాళ్లపాటు ఇలాగే కొనసాగుతుందో చూద్దాం అని అన్నారు. రష్యా తన వద్ద ఉన్న చమురును చాలా చౌకగా అమ్మేస్తోంది. అందుకోసం వాణిజ్య భాగస్వాములను వెతుకుతోందని, దాన్ని భారత్ ఉపయోగించుకుంటోంది అన్నారు.

బుకాయిస్తున్న ట్రంప్

భారత్, రష్యాలతో(India-Russia) అమెరికా బంధం దూరమైనవేళ ట్రంప్ తన సరికొత్త వాదాన్ని చెబుతున్నారు. ఇందులో తన తప్పేమీ లేదని బుకాయిస్తున్నారు. చైనా చేతిలోకి భారత్ వెళ్లిపోయేలా చేయడంలో తప్పెవరిది అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఎవరిదీ లేదు. మేమేమీ కావాలని అలా చేయలేదు. భారతదేశం రష్యా నుండి ఇంత ఎక్కువ చమురు కొనుగోలు చేయడం చూసి నేను చాలా నిరాశ చెందాను. అదే విషయాన్ని భారత్ కు చెప్పాం. కానీ వారు పట్టించుకోలేదు. అందుకే సుంకాలు విధించాలల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ట్రంప్.

అమెరికా అధికారులు భారత్‌పై ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు?
ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్ విధానాల నేపథ్యంలో భారత్‌పై విమర్శలు చేస్తున్నారు.

ట్రంప్ టారిఫ్ అంటే ఏమిటి?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన దిగుమతి సుంకాల విధానాన్ని ట్రంప్ టారిఫ్ అంటారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-siima-2025-these-are-the-winners-of-the-siima-awards-have-you-seen-the-photos-of-the-stars/cinema/542351/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870