Tariff: ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కాలమానం ప్రకారం, ఆగస్టు 27వ తేదీ అర్థరాత్రి 12గంటలకు భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10గంటల ప్రాంతంలో సుంకాలు అమల్లోకి వస్తాయని అగ్రరాజ్యం తెలిపింది. ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చిన 25శాతం సుంకాలు అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు 50శాతం టారిఫ్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో పేర్కొంది. భారత్ పై గతంలో ట్రంప్, 25శాతం సుంకాలు విధించారు. దీంతో అన్నిరంగాల్లోను భారత్ కు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంది.

వీటిపై తీవ్ర ప్రభావం
ట్రంప్ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25శాతం అదనపు టారీఫ్లను(Tariff) విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్ పై మొత్తం సుంకాలు 50శాతానికి పెరిగాయి. అయితే ఇది అనుచితం, అన్యాయం, ఆవాతుకమని భారత్ పేర్కొంది. ఆ విషయంలో తాము దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డ కాంగ్రెస్
నిన్న అహ్మదాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సుంకాల విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని, కానీ దానిని భరిస్తామని మోదీ స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకుగానూ భారత్ ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని విమర్శించారు.
అమెరికా విధించిన కొత్త సుంకాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి?
ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయి.
మొత్తం టారిఫ్‌లు ఎంత శాతానికి పెరిగాయి?
ఇప్పటి వరకు 25% ఉండగా, అదనంగా 25% పెరగడంతో మొత్తం 50%కి చేరుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: