Shukla: జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మరియు వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తదుపరి అంతరిక్ష మిషన్లపై వివరాలు వెల్లడించిన నారాయణన్, చంద్రయాన్-4లో(Chandrayaan) భాగంగా వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతామని చెప్పారు. ఇదే సమయంలో, శుభాంశు శుక్లా ప్రస్తుత కాలాన్ని భారత అంతరిక్ష పరిశోధనకు “స్వర్ణ యుగం“గా అభివర్ణించారు. వి. నారాయణన్ మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో చంద్రయాన్-4 మిషన్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. 2028 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం (BAS) మొదటి మాడ్యూల్ ప్రారంభం కానుంది. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ లాంచర్ (NGL)కు ఆమోదం లభించిందని తెలిపారు. 2040 నాటికి భారత్ చంద్రునిపై అడుగుపెట్టడం లక్ష్యమని” స్పష్టం చేశారు.

ఇది స్వర్ణయుగం:-అన్న శుక్లా
వ్యోమగామి శుభాంశు శుక్లా మాట్లాడుతూ, భారత్ తన గగన్‌యాత్రులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(space station) పంపగలిగిందని గుర్తు చేశారు. ఇది ప్రధానమంత్రి మోదీ ఆలోచనల ఫలితమని ఆయన తెలిపారు. గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొన్న తన ముగ్గురు సహచరులను కూడా గుర్తు చేస్తూ, “నలుగురు వ్యోమగాములు సమానంగా కృషి చేశారు” అని అన్నారు. మరింతగా, శుక్లా మాట్లాడుతూ, భారత అంతరిక్ష మిషన్ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది అని తెలిపారు. జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కూడా భారత్‌తో భాగస్వామ్యం చేయాలనే ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. గగన్‌యాన్, భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, అలాగే భవిష్యత్తులో చంద్రునిపై అడుగుపెట్టే లక్ష్యం కోసం యువత భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
భారత అంతరిక్ష కేంద్రం (BAS) ఎప్పటికి సిద్ధమవుతుంది?
మొదటి మాడ్యూల్ 2028లో ప్రారంభమై, 2035 నాటికి పూర్తిస్థాయి కేంద్రం ఏర్పడుతుంది.
భారత్ చంద్రునిపై ఎప్పటికి అడుగుపెట్టనుంది?
2040 నాటికి చంద్రునిపై భారత వ్యోమగామి అడుగుపెట్టడం లక్ష్యం.
Read hindi news: hindi.vaartha.com
Read also: