Lunar Eclipse: భారతదేశంలో సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుండి 8వ తేదీ తెల్లవారుజాము వరకు అతి దీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం,(According to astronomers)2022 తర్వాత ఇది భారత్‌లో కనిపించే ఎక్కువ సేపు కొనసాగే చంద్రగ్రహణం అవుతుంది.
- ప్రారంభం: రాత్రి 9:55 గంటలకు
- మధ్యస్థం: రాత్రి 11:42 గంటలకు
- ముగింపు: తెల్లవారుజామున 1:26 గంటలకు
- మొత్తం వ్యవధి: సుమారు 3 గంటల 30 నిమిషాలు
2018 జూలై 27 తర్వాత మన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం మొత్తం కనిపించడం ఇదే మొదటిసారి. తదుపరి దీర్ఘ చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న మాత్రమే కనిపిస్తుంది.

గ్రహణ సమయంలో చేయవలసినవి – చేయకూడనివి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం(Lunar Eclipse) ప్రభావం మనుషులపై పడుతుందని చెబుతున్నారు. అందువల్ల పండితులు కొన్ని నియమాలను సూచించారు.
చేయవలసినవి:
- గ్రహణం మొదలుకాకముందే (సాయంత్రం 7:55లోపే) భోజనం ముగించాలి.
- గ్రహణ ప్రారంభం కాగానే పట్టు స్నానం చేయాలి.
- “ఓం చంద్రశేఖరాయ నమః”, “ఓం దుర్గాయై నమః” వంటి మంత్రాలు జపించాలి.
- విడుపు స్నానం చేసి మరుసటి రోజు ఆలయ దర్శనం చేయాలి.
- దానం చేయడం శుభకరం (వెండి, రాగి, మినుములు, బియ్యం, తెల్లని వస్త్రాలు).
చేయకూడనివి:
- గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు.
- కుంభ, మీన రాశి వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు.
- గర్భిణీలు బయటికి రావద్దు, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి.
ఈ చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది?
సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55కి ప్రారంభమై, 8వ తేదీ తెల్లవారుజామున 1:26కి ముగుస్తుంది.
చంద్రగ్రహణం ఎంతసేపు ఉంటుంది?
మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also: