Landslide: ఇటీవలకాలంలో భూకంపాలు, క్లౌడ్ బరస్ట్లు, వరదలు, కొండచరియలు(Landslides) విరిగిపడిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ప్రకృతి తన ఉగ్రరూపాన్ని చూపుతుందో తెలియని అయోమనంలో మనం ఉన్నాం. తాజాగా సుడాన్పై ప్రకృతి విపత్తు కన్నెర్ర చేసింది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఏకంగా ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు. అసలే నిరుపేద దేశం దీనికితోడు అంతర్యుద్ధంతో ప్రజల జీవనవిధానం పూర్తిగా దెబ్బతిన్నది.

అసలే అంతర్యుద్ధంతో అతలకుతలం
సుడాన్ లో అంతర్యుద్ధంతో దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకవైపు అంతర్యుద్ధంతో సుడాన్(Sudan) సతమతమవుతున్నది. సరైన అభివృద్ధికి నోచుకోలేక ఒకవైపు, అంతర్గత విభేదాలు మరోవైపు ఆ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతున్నది. దీనికితోడు గత కొన్ని రోజులుగా సుడాన్లో ఎడతెరపి లేకుండా వరాలు కురుస్తున్నాయి. దీంతో సుడాన్లోని మర్రా పర్వతాల ప్రాంతాలో కొంచచరియలు విరిగిపడినట్లు సూడాన్ లిబరేషన్ మూమెంట్/ఆర్మీ తెలిపింది. ఆదివారం అనగా ఆగస్టు 31వ తేదీన కొండచరియలు విరిగిపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వెయ్యిమందికి పైనే ప్రజలు మరణించారని సుడాన్ మూమెంట్ ధ్రువీకరించింది. గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని, కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు సాయం చేయాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సహాయం సంస్థలను సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ విజ్ఞప్తి చేసింది.
కాల్పులో 80మంది మృతి
సూడాన్లో ఇటీవల పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) బలగాలు, సెంట్రల్ సూడాన్లోని సిన్నర్లో కాల్పులు జరపడం వల్ల దాదాపు 80మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికలను కిడ్నాప్ చేసేందుకు ఆర్ఎస్ఎఫ్ ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడం వల్ల ఈ ఘటన జరిగింది. గత జూన్ నుంచి ఆర్ఎస్ఎఫ్ బలగాల నియంత్రణలోనే ఈ ప్రాంతం ఉంటోంది. దాదాపు 7.25లక్షల మంది ఇప్పటివరకు వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ మైగ్రేషన్ సంస్థ ఒకటి తెలిపింది. 2023 నుంచి సుడాన్లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్-ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దన్ డగ్లోల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్-ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో 29,600మందికి పైగా ప్రజలు మరణించారు.
ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఈ ప్రమాదం సూడాన్‌లోని పశ్చిమ డార్ఫూర్ ప్రాంతంలో ఉన్న టరాసిన్ గ్రామంలో జరిగింది.
ప్రమాదానికి గల కారణం ఏమిటి?
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఈ ప్రమాదం సంభవించింది.
Read hindi news:hindi.vaartha.com
Read also: