Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసి, ఏవిధంగానైనా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని(Khamenei) హతమార్చలని చూసింది. అందుకు అమెరికా కూడా ఇశ్రాయెల్ కు భారీగా సాయం చేసింది. ఖమేనీని హతమారిస్తేనే ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపివేస్తుందని అప్పట్లో అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఖమేనీ బంకర్లలో దాచుకుని, తన ప్రాణాలను కాపాడుకున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఖమేనీ మరోసారి అమెరికాపై మండిపడ్డారు. తమను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కానీ దానిని ఎదుర్కొనేందుకు కలిసి కటుటగా పోరాడదామని తెలిపారు. అదే సమయంలో భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటన ఆయన వెబ్సైట్లో జారీ చేశారు.

టెహ్రాన్ ను అస్థిరపరిచేందుకు అమెరికా యత్నం: ఖమేనీ
జూన్ మాసంలో తమ అణుకేంద్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం ప్రతీకార చర్యను ప్రేరేపించిందని ఖమేనీ తెలిపారు. టెహ్రాన్ ను అస్థిరపరిచేందుకు అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఆరోపణలు చేశారు. ఇటీవల యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజు అమెరికన్ ఏజెంట్లు యూరప్ లో భేటీ అయ్యారని తెలిపారు. తమ దేశాన్ని తదుపరి ఏ ప్రభుత్వం పాలించాలి అనే విషయంపై చర్చించారని చెప్పిరు. ఏదేమైనా ఇరాన్ విధేయతగా ఉండాలని అమెరికా కోరుకుంటోందని చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రభుత్వం సహా ఇరాన్ మొత్తం తమ సైన్యానికి అండగా నిలబడిందన్నారు. అందుకే శత్రువులను గట్టిగా దెబ్బతీశామని తెలిపారు. అంతర్గత విభేదాలపై హెచ్చరించారు. కొన్ని విదేశీశక్తులు రెచ్చగొడుతున్నాయని పేరొకన్నారు
ఖమేనీ హత్యను నేనే ఆపా: ట్రంప్
ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధంలో విజయం తమదే అన్న ఖమేనీ మాటలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ ఘర్షణలో ఇరాన్ ఘోరంగా ఓడిపోయిందన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలన్నారు. అంతేకాకుండా ఖమేనీ హత్య చేయాలని ఇజ్రాయెల్ చేసిన ప్లాన్ ను అడ్డుకున్నానని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం సమయంలో ఖమేనీని హత్య చేయాలనే ప్రణాళికను రచించిందని, కానీ తాను ఇజ్రాయెల్ ప్రణాళికను వీటో చేశానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ కమాండర్లు, శాస్త్రవేత్తలు, అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని, ఇశ్రాయేల్ దాడులు చేసింది. అనంతరం డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇరుదేశాల మధ్య కాల్పుల
విరమణ ఒప్పందం(Severance agreement) కుదిరిందని ప్రకటించారు. అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్ మీడియా చెప్పింది. కాల్పుల విరమణ అనంతరం ఖమేనీ మాట్లాడారు. ఇజ్రాయెల్పై విజయం సాధించామన్న ఖమేనీ, అమెరికాను చాచి లెంపకాయ కొట్టామన్నారు.
ఖమేనీ అమెరికాపై ఏమన్నారు?
అమెరికా ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకువచ్చినా, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని ఖమేనీ స్పష్టం చేశారు.
టెహ్రాన్‌పై దాడి ఎందుకు జరిగింది?
జూన్‌లో ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. దీని వెనుక టెహ్రాన్‌ను అస్థిరపరచాలనే ప్రయత్నం ఉందని ఖమేనీ ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: