Breaking news: నిన్ననే మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్లో(Afghanistan) భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. తాజాగా శుక్రవారం ఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్కాలజీ తెలిపింది. ఈ భూకంపం వల్ల దాదాపు రెండువేల మందికి పైగానే మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.
తరచూ భూకంపాలతో పరేషాన్
గురువారం మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుక్రవారం హఠాత్తుగా 6.2 తీవ్రతతో భారీ భూకంపం(EarthQuake) వచ్చింది. దీంతో రెండువేల మందికి పైగా మరణించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొన్నారు. అంతేకాకుండా పలు ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేకులు గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీపంలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు పూనుకుంది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. అసలే అక్కడ తాలిబన్ ప్రభుత్వం పాలనలో ఆర్థికంగా చతికిలపడ్డ ఆ దేశం, మతపరమైన కఠిన నియమాలను తాలిబన్ లు పెడుతు మహిళలు, బాలికలను పలు హింసల గుండా జీవిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘన్ ప్రజల జీవనవిధానం స్తంభించిపోయింది.
భూకంపం ఎప్పుడు మరియు ఎక్కడ సంభవించింది?
అఫ్ఘానిస్తాన్‌లోని తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా కునార్ మరియు నంగర్‌హార్ ప్రావిన్సులలో భారీ భూకంపం సంభవించింది. ఇది సెప్టెంబర్ 1, 2025, ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
భూకంప తీవ్రత ఎంత?
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. దీనికి తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉండటంతో నష్టం ఎక్కువగా జరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Read also :