సిరియాలోని పాల్మైరా(Syria Attack) ప్రాంతంలో అమెరికన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Mexico Import Tariffs: భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. ట్రంప్ తీవ్ర ప్రతీకారం హెచ్చరిక
ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది ఐసిస్ చేసిన ఉగ్రదాడేనని ధృవీకరిస్తూ, దీనికి కఠినమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. మరణించిన వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్, గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ వివరాలను ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు.
గతేడాది డిసెంబర్‌లో బషర్ అల్ అసాద్ అధికారాన్ని(Syria Attack) కోల్పోయిన తర్వాత సిరియాలో అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన తొలి ఘటన ఇదే కావడం గమనార్హం. దాడికి పాల్పడిన వ్యక్తి సిరియా ప్రభుత్వ దళాలకు చెందిన సైనికుడేనని అక్కడి అధికారులు అంగీకరించారు. అయితే అతడిని వెంటనే మట్టుబెట్టామని, అతడికి ఎలాంటి కీలక బాధ్యతలు లేవని స్పష్టం చేశారు.
పాల్మైరా ప్రాంతంలో ఐసిస్ ముప్పు ఉందని ముందుగానే అమెరికాకు హెచ్చరికలు చేసినట్లు సిరియా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని ఆరోపించాయి. ఈ ప్రాంతం ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రభుత్వ నియంత్రణలో లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య భద్రతా సహకారానికి మరో సవాలుగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :