हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

SudhaMurty :70 గంటల పని పై సుధామూర్తి స్పందన

Anusha
SudhaMurty :70 గంటల పని పై సుధామూర్తి స్పందన

70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, ఉత్సాహంగా చేయాలనుకుంటే సమయం ఎప్పుడూ పరిమితంగా మారదని ఆమె వ్యాఖ్యానించారు.ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధామూర్తి మాట్లాడుతూ,

సంకల్పం

“నా భర్త డబ్బులేమీ లేకపోయిన సమయంలో కూడా ఇన్ఫోసిస్‌ను స్థాపించాలనే సంకల్పం చేశారు. అప్పుడు అంకితభావం ఉన్న కొంతమంది ఉద్యోగులతో కలిసి వారానికి 70 గంటల కన్నా ఎక్కువ సమయం పని చేశారు. అప్పటి కష్టమే ఇప్పుడు ఇన్ఫోసిస్‌ను గొప్ప స్థాయికి తీసుకెళ్లింది.కేవలం నా భర్త మాత్రమే కాదు,జర్నలిస్టులు, డాక్టర్లు, మరికొందరు రంగాల్లో పని చేసే వారు కూడా వారానికి 90 గంటల పాటు కృషి చేస్తున్నారు. భగవంతుడు అందరికీ 24 గంటల సమయమే ఇచ్చాడు. దానిని ఏ విధంగా వినియోగించుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం.”

కుటుంబ జీవితం

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి సుధామూర్తిప్రస్తావించారు.నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టినప్పుడు, తాను ఇంటి బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె గుర్తుచేశారు.అప్పట్లో నా భర్త కంపెనీని ఎదిగించే పనిలో ఉండగా, నేను ఇంటిని చూసుకోవడం, పిల్లలను పెంచడం, అలాగే కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించడం చేశారు అని తెలిపారు.ప్రస్తుతం తాను భర్త కంటే ఎక్కువ సమయం పని చేస్తున్నానని, అయితే నారాయణమూర్తి వెనుక నుంచి తనకు సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారని వెల్లడించారు.ప్రతి మహిళ విజయానికి వెనుక అర్థం చేసుకునే వ్యక్తి ఉంటాడు. వృత్తి జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉండాలి. అదే జీవితం,అని వ్యాఖ్యానించారు.

74729928

పని గంటలపై వివాదం

నారాయణమూర్తి “భారత యువత వారానికి 70 గంటలు పని చేయాలి” అని వ్యాఖ్యానించగా, దీనిపై సమర్థించేవారు, వ్యతిరేకించేవారు భిన్నంగా స్పందించారు,కొందరు ఈ సూచనను దేశ అభివృద్ధికి అవసరమైన మార్గంగా భావిస్తే,మరికొందరు ఇది పని దోపిడీకి మార్గం సుగమం చేస్తుందని విమర్శించారు.అంతేకాకుండా, ఇటీవల ఎల్ టి ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ కూడా “వారానికి 90 గంటలు పనిచేయాలి” అన్న వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదానికి తెరతీసింది.

సమకాలీన చర్చ

ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన లభించినప్పటికీ, నేటి యువత కోసం పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత అవసరం అనే చర్చ ప్రారంభమైంది.ఎక్కువ గంటలు పని చేయడం ఉత్పాదకతను పెంచుతుందా లేదా శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతుందా?పని గంటలు పెంచడం సహజంగానే దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందా లేదా కొత్త తరానికి ఒత్తిడి తెస్తుందా?ఈ అంశాలపై నిపుణులు, ఆర్థికవేత్తలు, చర్చిస్తున్నారు. భారత దేశ అభివృద్ధికి యువత కృషి చేయడం అవసరం, సహజంగా వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం, సామాజిక సంబంధాలు కూడా దెబ్బతినకుండా సమతుల్యమైన విధానం అనుసరించాలి అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ, సుధామూర్తి ఇలా స్పందించారు. ఇష్టపడి పని చేయడం ఎలా సానుకూల ప్రభావాన్ని చూపుతుందో వివరించారు. అయితే, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే పని గంటల కంటే, సామర్థ్యాన్ని మెరుగుపరచడం ముఖ్యం అనే దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870