అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. టారిఫ్‌ల తగ్గింపు కోసం దక్షిణ కొరియా 350 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ట్రంప్ (Donald Trump), దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
Read Also: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా
ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియా అమెరికా నుంచి ఆయిల్ (oil), గ్యాస్ (gas) వంటి ఉత్పత్తులను భారీ మొత్తంలో దిగుమతి చేసుకోవాలని అంగీకరించింది. ఇది అమెరికా ఎనర్జీ ఎగుమతులపై భారీగా ప్రభావం చూపనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఒప్పందం ద్వారానే కాకుండా, అమెరికా, దక్షిణ కొరియా మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ దేశ కంపెనీలు USలో పెట్టే పెట్టుబడుల విలువ $600Bను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: