Singer: తెలుగు సినీ రంగంలో తొలి తరపు గాయనిగా, నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రావు బాలసరస్వతి దేవి (97) మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె మరణాన్ని స్మరించుకుంటూ, “రావు బాలసరస్వతి దేవి గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారమైనవి. ఆమె మృతి ఒక తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
US:భారత్ సాయం మాకు అవసరం: ఆర్థిక మంత్రి

Singer Balasaraswathy passes away
నటుడు బాలకృష్ణ కూడా ఆమెను స్మరించారు. “చిన్న వయసులోనే కళారంగంలో అడుగుపెట్టి, 1930ల దశకంలోనే గాయని, నటిగా గుర్తింపు పొందిన బాలసరస్వతి దేవి గారు తెలుగు సినిమాకు మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా చరిత్ర సృష్టించారు. భాగ్యలక్ష్మి సినిమాలో పాడిన ‘థిన్నే మీద సిన్నోడ’ పాటతో తెలుగు సంగీత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తర్వాత అనేక సినిమాల్లో స్వరమందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. రేడియోలో ‘లైట్ మ్యూజిక్’కు ప్రాధమ్యమిస్తూ వేల పాటలు పాడి చిరస్మరణీయ స్థానాన్ని పొందారు” అని అన్నారు. బాలసరస్వతి దేవి గారి మరణంతో తెలుగు సినీ, సంగీత ప్రపంచం మరో మాణిక్యాన్ని కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
రావు బాలసరస్వతి దేవి ఎవరు?
రావు బాలసరస్వతి దేవి తెలుగు సినిమా రంగంలో తొలి తరపు నేపథ్య గాయనిగా, నటిగా ప్రసిద్ధి పొందారు. ఆమె 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయని, నటిగా పనిచేశారు.
రావు బాలసరస్వతి దేవి తెలుగు సినీ చరిత్రలో ఎందుకు ప్రత్యేకం?
ఆమె తెలుగు సినిమా రంగంలో మొదటి ప్లేబ్యాక్ సింగర్. భాగ్యలక్ష్మి చిత్రంలో “థిన్నే మీద సిన్నోడ” పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: