ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న ఓ పాఠశాలలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది (Eight people) ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆస్ట్రియా(Austria School)లోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని స్కూల్‌లో షూటింగ్ ఘటన చోటుచేసుకున్నది. ఆ కాల్పుల్లో (firing)ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. దీంట్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నట్లు కూడా తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో సెకండరీ స్కూల్ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు.
ఈ ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Read Also:Montek: భారత్ వినాశనమే చైనాకు కావాలి..మొంటేక్ అహ్లూవాలియా