Shakira Mexico concert : మెక్సికో సిటీలోని ఐకానిక్ Zócalo స్క్వేర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌తో షకీరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఉచిత ఈవెంట్‌కు సుమారు 4 లక్షల మందికి పైగా అభిమానులు హాజరైనట్లు స్థానిక గణాంకాలు చెబుతున్నాయి. జోకాల చరిత్రలో ఇంత భారీ జనసందోహం ఇదే తొలిసారి అని నివేదికలు వెల్లడించాయి. నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, రద్దీని నియంత్రించేందుకు సమీప ప్రాంతాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
షకీరా తన హిట్ సాంగ్స్—“Hips Don’t Lie”, “Waka Waka (This Time for Africa)”, “Don’t Bother”—తో అభిమానులను ఉర్రూతలూగించింది. కొలంబియన్ ఆర్టిస్ట్‌తో కలిసి వేదిక పంచుకుంటూ కొత్త పాటను కూడా ప్రదర్శించింది.
Read also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం
ఈ విజయోత్సాహంతో మే 2న రియో డి జనీరోలోని Copacabana Beach వద్ద మరో మెగా ఫ్రీ కాన్సర్ట్‌కు సిద్ధమవుతోంది. ఇక ఆమె ‘Las Mujeres Ya No Lloran’ వరల్డ్ టూర్ అత్యధిక వసూళ్లు రాబట్టిన హిస్పానిక్ టూర్‌గా (Shakira Mexico concert) నిలిచినట్లు సంగీత వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధించి మిలియన్ల మందిని ఆకట్టుకుంది. అదనంగా, 2026 Rock and Roll Hall of Fame నామినేషన్లలో చోటు దక్కించుకోవడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయి.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: