భారత్‌కు అంబాసిడర్‌గా సెర్గియా గోర్(Sergio Gor)ను కన్ఫర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగళవారం 38 ఏళ్ల గోర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేటర్లు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉన్నా.. భారత్‌కు సెర్గియో గోర్‌ను (Sergio Gor)అంబాసిడర్‌గా అమెరికా నియమించింది. దక్షిణాసియా దేశాల వ్యవహారాల శాఖ మంత్రిగా పౌల్ కపూర్‌ను నామినేట్ చేశారు. సింగపూర్‌కు అంజనీ సిన్హాను అంబాసిడర్‌గా అమెరికా ప్రకటించింది.

అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సెర్గియో గోర్ (Sergio Gor) అభిప్రాయపడ్డారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశం వల్ల ప్రాంతీయ ప్రాబల్యం పెరుగుతందన్నారు. భారత్‌తో భాగస్వామ్యం నేపథ్యంలో అమెరికా ప్రయోజనాల గురించి వివరించనున్నట్లు చెప్పారు. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య సంబంధాల వల్ల అమెరికా పోటీతత్వం పెరుగుతోందని, ఇతర దేశాలపై చైనా ఆర్థిక ప్రభావం కూడా తగ్గుతుందని గోర్ తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత అంశాల్లో భారత పాత్రను విస్మరించలేమని ఆయన అన్నారు. దక్షిణాసియా ప్రాంతం స్థిరంగా ఉండాలన్నది అమెరికా ఆకాంక్ష అని తెలిపారు.
సెర్గియో గోర్ ఎవరు?
సెర్గియో గోర్ (జననం నవంబర్ 30, 1986) ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు రాజకీయ కార్యకర్త, అతను ఆగస్టు 2025 నుండి దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలకు యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక రాయబారిగా మరియు జనవరి నుండి వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా పనిచేశాడు .
సెర్గియో గోర్ ఏ కంపెనీని స్థాపించారు?
అతని సలహాదారుగా మరియు పుస్తక ప్రచురణ నిర్వాహకుడిగా. ట్రంప్ జూనియర్ మరియు గోర్ అక్టోబర్ 2021లో విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్ అనే సంప్రదాయవాద ప్రచురణ సంస్థను స్థాపించారు; ఆ కంపెనీ ట్రంప్ జూనియర్ తండ్రి డోనాల్డ్ ట్రంప్ గురించి అవర్ జర్నీ టుగెదర్ (2021), లెటర్స్ టు ట్రంప్ (2023) మరియు సేవ్ అమెరికా (2024) వంటి అనేక పుస్తకాలను ప్రచురించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: