సాధారణంగా మండే ఎడారులు గుర్తుకొచ్చే సౌదీ అరేబియాలో ప్రస్తుతం వాతావరణం అనూహ్యంగా మారింది, జెడ్డా, మక్కా సమీపంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టిస్తున్నాయి, రోడ్లు పూర్తిగా చెరువుల్లా మారిపోయాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Madhya Pradesh:ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు.. అసలేం జరిగింది?

వరదలు మరియు భద్రతా హెచ్చరికలు
సౌదీ అరేబియాలోని మక్కా, (Saudi Weather Alert) జెడ్డా, రబీగ్, ఖులైస్, బహ్రా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం, ఆకస్మిక వరదలు, బలమైన ఈదురు గాలులు, ఉరుములో కూడిన తుఫాన్ విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో హైల్, ఖాసిమ్, తబుక్, మక్కా, అసిర్, అల్ బహా వంటి ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జోన్లలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పాఠశాలలు, కార్యక్రమాల రద్దు
భారీ వరదల కారణంగా రోడ్లు సరస్సుల్లా మారిపోవడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సిందిగా సూచించారు. సినిమా హాళ్లు కూడా మూసివేశారు. వరదల నేపథ్యంలో పలు అంతర్జాతీయ కార్యక్రమాలను వాయిదా వేయాల్సి వచ్చింది. జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా రాయబార కార్యాలయం కూడా తన గాలా ఈవెంట్‌ను రద్దు చేసుకుంది.
రాబోయే రోజుల్లో వాతావరణ అంచనా
మదీనా, తబుక్, అల్ జాఫ్, ఉత్తర సరిహద్దు ప్రాంతాలతో పాటు తూర్పు ప్రావిన్స్‌లో బుధవారం, గురువారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరదల కారణంగా ప్రాణనష్టాలు జరుగుతున్నాయనే పుకార్లను నమ్మవద్దని, రెస్క్యూ టీమ్‌లతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వరదలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: