సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్పాట్‌లోనే 42 మంది సజీవ దహనమయ్యారు.
Read Also: USA: ఈ దేశా పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని వెల్లడించారు.

మదీనా-మక్కా రహదారిపై జరిగిన బస్సు ప్రమాదం
సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. మదీనా-మక్కా రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కిరణ్ రిజిజు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: