ఎవరూ మరణించినా కడసారిగా చూడాలని కోరుకుంటారు. కానీ కొందరి మరణం వారి కడచూపుకు కూడా నోచుకోలేరు. సౌదీ అరేబియాలో మక్కా-మదీనా మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సు, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగిన పూర్తిగా కాలిపోయింది. అయితే వారి మృతదేహాలు..స్వస్థలాలకు రావడానికి అక్కడి చట్టాలు అడ్డంకిగా మారాయి. ఉమ్రా యాత్రికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.
సౌదీ అరేబియాలో హజ్,(Saudi Arabia) ఉమ్రా తీర్థయాత్రలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మతపరమైన యాత్ర సమయంలో (మక్కా, మదీనా లేదా సౌదీ అరేబియాలో ఎక్కడైనా) యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని వారి స్వదేశానికి పంపడానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ నియమం అనేక ఏళ్లుగా అమలులో ఉంది. అయితే హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది.
Read Also: Bank: బ్యాంకుల విలీనం పై జోరందుకుంటున్న ఊహగానాలు

సౌదీ అరేబియాలోనే ఖననం
మక్కా,(makkah) మదీనా వంటి తీర్థయాత్రలకు వెళ్లేముందు యాత్రికులు నింపే అధికారిక ఫారంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఒక వేళ ఈ యాత్ర సమయంలో యాత్రికుడు మరణిస్తే.. మృతదేహాన్ని సౌదీ అరేబియాలోనే ఖననం చేయడానికి అంగీకరిస్తూ ఆ ఫారంలో వవారు సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భారత్ కు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వపరంగా బీమా సౌకర్యాలు లేవు
సౌదీ హజ్ చట్టం ప్రకారం.. హజ్, ఉమ్రా మతపరమైన యాత్రలు కాబట్టి వాటికి ప్రభుత్వం పరంగా ఎలాంటి బీమా ఆధారిత సౌకర్యాలు ఉండవు. హజ్ యాత్ర సమయంలో ఎవరైనా మరణిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. హజ్ యాత్రికులు
భారత్ లో (India) ప్రైవేట్ బీమా తీసుకుని ఉంటే వారి పాలసీ ప్రకారం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను సౌదీ అరేబియా ప్రభుత్వం కాకుండా.. సంబంధిత యాత్రికుడి దేశం, వారి బీమా సంస్థ ద్వారా మాత్రమే పూరి చేయాల్సి ఉంటుంది. అరేబియా నిబంధనల ప్రకారం మరణించిన 45 మంది మృతదేహాలను బహుశా అక్కడే ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: