Saudi Arabia High Alert: పశ్చిమ ఆసియాలో భద్రతా పరిస్థితులు తలక్రిందులవుతున్న నేపథ్యంలో అమెరికా (America) ప్రభుత్వం అత్యవసర ప్రకటన జారీ చేసింది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేయడంతో..అక్కడ పనిచేస్తున్న తమ అత్యవసరం కాని (Non-emergency) ప్రభుత్వ ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను తక్షణమే సౌదీ అరేబియాను విడిచి వెళ్లిపోవాలని (Ordered Departure) వాషింగ్టన్ ఆదేశించింది. గల్ఫ్ ప్రాంతమంతటా అమెరికా రాయబార కార్యాలయాల నుంచి సిబ్బందిని వెనక్కి పిలుస్తున్నట్లు వచ్చిన నివేదికలపై ఆయన స్పందిస్తూ.. ఈ అత్యవసర ఆదేశాలు ప్రస్తుతానికి కేవలం సౌదీ అరేబియాలోని మిషన్‌కు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా హౌతీలు విరుచుకుపడుతున్నారు.

Saudi Arabia High Alert: చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి
దమ్మామ్‌లోని ‘కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై జరిగిన దాడిలో ఒక వ్యక్తి మరణించగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే సౌదీ అరామ్‌కోకు చెందిన కీలకమైన ‘షైబా’ (Shaybah) చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి జరగ్గా, దాన్ని అడ్డుకున్న సమయంలో పడిన తీవ్ర విఘాతాల వల్ల ఫిలిప్పీన్స్, నేపాల్ దేశాలకు చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనే రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు 20కి పైగా దాడులు చేశారని సౌదీ నేతృత్వంలోని ఆర్మడ్ కూటమి ప్రకటించింది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ప్రత్యేక భద్రతా హెచ్చరికను జారీ చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also: