ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన పెట్టుబడి వ్యూహాలను వేగవంతం చేస్తూ, రానున్న నాలుగు సంవత్సరాల్లో భారత్‌లో భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కీలక ప్రకటన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల.. బుధవారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తో సమావేశమయ్యారు.ఈ భేటీ సందర్భంగా సాంకేతికత భవిష్యత్తు, ఏఐ విస్తృత అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
Read Also: Karnataka: కాంగ్రెస్ సమావేశంలో అభివృద్ధి నిధులపై ఎమ్మెల్యేల ఆందోళనలు
సత్య నాదెళ్లను కలవడం ఎంతో ఆనందంగా ఉంది
అనంతరం గౌతమ్ అదానీ (Gautam Adani) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “సత్య నాదెళ్లను కలవడం, టెక్నాలజీ భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన అభిప్రాయాలు తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏఐ యుగంలో డిజిటల్, భౌతిక ప్రపంచాలు ఏకమవుతున్న తరుణంలో
మైక్రోసాఫ్ట్‌తో 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు మేం ఉత్సాహంగా ఉన్నాం” అని పేర్కొన్నారు. సత్య నాదెళ్ల (Satya Nadella) స్వయంగా రూపొందిస్తున్న ఏఐ యాప్స్ డెమోను చూడటం, గొప్ప నాయకుల నాయకత్వ పటిమకు నిదర్శనమని అదానీ ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: