శ్రీలంక క్రికెట్‌కు చెందిన మాజీ ఆటగాడు సాలియా సమన్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువవడంతో ఆయనకు ఐదేళ్లపాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధం విధించింది. ఇటీవల ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ICC Anti-Corruption Unit) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం వెలువడింది.2021లో అబుదాబిలో జరిగిన టీ-10 క్రికెట్ లీగ్ సమయంలో సమన్ మ్యాచ్ ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఐసీసీ మొదట ప్రాథమికంగా విచారించి, తరువాత అవినీతి నిరోధక ట్రిబ్యునల్‌కు పంపించింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు జరిగిన ఈ విచారణలో సమన్ అవినీతి చర్యలకు పాల్పడినట్లు సాక్ష్యాలు సమర్పించబడ్డాయి.
అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధం
ఐసీసీ జరిపిన విచారణలో సాలియా సమన్ (Saliya Saman) పై మూడు ముఖ్యమైన ఆరోపణలు రుజవయ్యాయి. అవి..టీ10 లీగ్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేయడానికి కుట్ర పన్నడం.మ్యాచ్ ఫిక్సింగ్ కోసం మరో ఆటగాడికి డబ్బు లేదా బహుమతులు ఇవ్వడం.అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించేందుకు ఇతర ఆటగాళ్లను ప్రోత్సహించడం.ఈ నేరాలు రుజువు కావడంతో సాలియా సమన్‌పై ఐదేళ్లపాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధం విధించారు. ఈ నిషేధం 2023 సెప్టెంబర్ 13న అతను తాత్కాలికంగా సస్పెండ్ అయిన తేదీ నుంచి వర్తిస్తుంది. ఇదే లీగ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 8 మందిలో సాలియా సమన్ ఒకరు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నసీర్ హుస్సేన్ (Nasir Hussain) కు కూడా ఇదే విధమైన ఆరోపణల కారణంగా రెండేళ్ల నిషేధం విధించబడింది.

తన కెరీర్
39 ఏళ్ల సాలియా సమన్ తన కెరీర్‌లో శ్రీలంక తరపున 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 77 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. సాలియా సమన్ శ్రీలంక సీనియర్ జట్టుకు ఆడకపోయినా, దేశీయ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ తన కెరీర్‌లో 101 ఫస్ట్-క్లాస్, 77 లిస్ట్-ఎ, 47 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను 3662 పరుగులు చేసి 231 వికెట్లు తీశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 898 పరుగులు, 84 వికెట్లు సాధించాడు. టీ20 క్రికెట్‌లో 673 పరుగులు, 58 వికెట్లు తీసుకున్నాడు. కానీ, మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో అతని క్రికెట్ కెరీర్ వివాదాస్పదంగా ముగిసింది. క్రికెట్‌లో అవినీతిని అరికట్టడానికి ఐసీసీ తీసుకున్న ఈ కఠినమైన చర్య, క్రీడల సమగ్రతను కాపాడటానికి నిరంతరంగా కృషి చేస్తుందని మరోసారి నిరూపించింది.
సాలియా సమన్ ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించారు?
ఆయన శ్రీలంక డొమెస్టిక్ క్రికెట్‌లో బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్, రాగమ క్రికెట్ క్లబ్ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
సాలియా సమన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారా?
లేదు, సాలియా సమన్ శ్రీలంక తరఫున అంతర్జాతీయ స్థాయిలో (టెస్ట్, వన్డే, టి20) ఆడలేదు. ఆయన ప్రదర్శనలు ప్రధానంగా డొమెస్టిక్ స్థాయిలోనే గుర్తింపు పొందాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: