Khaleda Zia funeral : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా భారత ప్రభుత్వం వెల్లడించింది. ఖలీదా జియా అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం, ప్రజల తరఫున జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
దీర్ఘకాల అనారోగ్యంతో ఖలీదా జియా మంగళవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియల కోసం జైశంకర్ డిసెంబర్ 31న ఢాకా వెళ్లనున్నారు.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీ ఖలీదా జియా మృతిపై (Khaleda Zia funeral) సంతాపం ప్రకటించారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో జరిగిన భేటీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఖలీదా జియా దార్శనికత, రాజకీయ వారసత్వం భారత్–బంగ్లాదేశ్ సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
అంత్యక్రియల సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌తో జైశంకర్ ప్రత్యేక భేటీ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: