Russian underwater drone : రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సముద్ర రంగంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశీయంగా అభివృద్ధి చేసిన మానవ రహిత నీటి అడుగున డ్రోన్‌ను యుద్ధంలో ప్రయోగించినట్లు వెల్లడించింది. ‘సబ్ సీ బేబీ’ పేరుతో రూపొందించిన ఈ అండర్‌వాటర్ డ్రోన్ ద్వారా రష్యాకు చెందిన కిలో-క్లాస్ జలాంతర్గామిని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ భద్రతా అధికారులు ప్రకటించారు.
నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకాదళానికి కీలకమైన నొవోరోసిస్క్ పోర్ట్‌లో నిలిచిన జలాంతర్గామిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ దాడిలో జలాంతర్గామికి తీవ్ర నష్టం వాటిల్లిందని, పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేర్కొన్నాయి. ఈ జలాంతర్గామి ఉక్రెయిన్‌పై తరచుగా ప్రయోగించే ‘కాలిబర్’ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించారు.
Read also: Gig Economy: బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ
నౌకాదళ యుద్ధ చరిత్రలో తొలిసారిగా నీటి (Russian underwater drone) అడుగున డ్రోన్ ద్వారా జలాంతర్గామిని లక్ష్యంగా చేసుకున్న ఘటన ఇదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి సలహాదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన పేలుడు దృశ్యాల వీడియోను కూడా ఉక్రెయిన్ విడుదల చేయడంతో విషయం మరింత సంచలనంగా మారింది.
అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. నొవోరోసిస్క్ పోర్ట్‌లో ఉన్న తమ నౌకలకు లేదా జలాంతర్గాములకు ఎలాంటి నష్టం జరగలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ నల్ల సముద్ర నౌకాదళం యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపింది.
సాంప్రదాయ నౌకాదళ బలం పరిమితంగా ఉన్న ఉక్రెయిన్, రష్యా శక్తివంతమైన నల్ల సముద్ర ఫ్లీట్‌ను ఎదుర్కొనేందుకు డ్రోన్ సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తోంది. ఉపరితల డ్రోన్లతో పాటు నీటి అడుగున డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడి నిజమైతే, ప్రపంచ నౌకా యుద్ధ విధానంలో ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: