రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఏండ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ డ్రోన్‌లు నిరంతరం రష్యా ఇంధన సరఫరా (Fuel supply)వ్యవస్థలపై దాడులు చేస్తున్నాయి. దాంతో రష్యాలో చమురుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల చమురు ఎగుమతులను నిలిపివేయాలని క్రెమ్లిన్ ఆదేశించింది. సమ్మర్ సీజన్‌లో ఉక్రెయిన్ పూర్తిగా రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాలు, ఇంధన సరఫరా రైళ్లను టార్గెట్ చేసింది. సాధారణంగా ఆ సీజన్‌లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇంధన డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దాంతో దేశంలో ఇంధన కొరతను సృష్టించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు ప్లాన్ చేసింది. ఫలితంగా ఇంధన కొరత ఏర్పడింది. అయితే రష్యా (Russia)అధికారులు మాత్రం ఈ నిషేధానికి రవాణా వ్యవస్థల్లో కొరతను కారణంగా చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ మునుపటిలా సరఫరా చేస్తామని అంటున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం తాము రష్యా (Russia)లోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు చెబుతోంది. దక్షిణ రష్యా(Russia)లో గ్యాజ్‌ప్రోమ్ నిర్వహిస్తున్న ఓ భారీ చమురు శుద్ధి కేంద్రాన్ని కూడా ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసంచేశాయి.

ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా మార్చిలో కూడా తమ దేశం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్‌లో కొంత బ్యాన్ విధించింది. మళ్లీ జూలైలో ఆ బ్యాన్‌ను తొలగించింది. తాజాగా గురువారం ఆ దేశ డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నొవాక్ ఈ నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. డీజిల్‌లో కూడా కొంతమేరకు ఎగుమతిని ఆపినట్లు తెలిపారు. కాగా క్రిమియాలో సగం పెట్రోల్ పంపులు నిల్వలు లేక మూతపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలాచోట్ల వాహనాలు ఇంధనం కోసం బారులుతీరినట్లు తెలిపింది.
రష్యాలో ఎంత మంది హిందువులు ఉన్నారు?
రష్యా యొక్క 2012 అధికారిక జనాభా లెక్కల ప్రకారం, రష్యాలో సుమారు 140,000 మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్లు గుర్తించారు, ఇది ఆ సమయంలో మొత్తం జనాభాలో 0.1%. కొన్ని అంచనాల ప్రకారం అధిక సంఖ్యను సూచిస్తున్నప్పటికీ, అధికారిక జనాభా లెక్కల డేటా ఆధారంగా 2012 సంఖ్య ఎక్కువగా ఉదహరించబడింది, అయినప్పటికీ ఇది అన్ని ISKCON అనుచరులను కలిగి ఉండకపోవచ్చు.
రష్యాలో ఎంత మంది ముస్లింలు ఉన్నారు?
మార్చి 2024 అంచనాల ప్రకారం రష్యాలో 26 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారని అంచనా, మొత్తం జనాభాలో వీరు 15% మంది ఉన్నారు. ఉత్తర కాకసస్, టాటర్స్తాన్ మరియు బాష్కోర్టోస్తాన్‌లలో ప్రధాన జనాభాతో ఇస్లాం దేశంలో రెండవ అతిపెద్ద మతం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: