దాదాపు నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తనవంతు కృషి చేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. ఇక రష్యా కూడా దూకుడు పెంచుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన దొనెట్యన స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 70శాతానికి ఎపైగా పట్టు సాధించింది. మిగిలిన 30 శాతం కూడా తమ భూభాగంలో కలిపేసుకోవాలని భావిస్తోంది.

ఉక్రెయిన్ దళాలను వెనక్కి నెట్టేందుకు రష్యా యత్నం
ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి దొనెట్కు కీలక ప్రదేశంగా ఉంది. ఒకవేళ దీన్ని ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించుకుంటే ఉక్రెయిన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోర్ట్రెస్ బెల్డ్(Fortress Bellt) గా పిలిచే నాలుగు నగరాలకే ఇప్పటిదాకా ఉక్రెయిన్ దళాలు పరిమితం అయ్యాయి. ఇక్కడ చాలారోజుల నుంచి మాస్కో దళాలకు ఉక్రెయిన్ బలగాలు అడ్డుకుంటున్నాయి. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ బలగాల కొరత ఉండటంతో రష్యాకు ఇది అనుకూలంగా మారింది. దీని ఫలితంగా ఉక్రెయిన్ బగాలను వెనక్కి నెట్టేందుకు రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది.
రష్యా ఉక్రెయిన్‌పై ఎందుకు దాడులు పెంచుతోంది?
భూభాగ విస్తరణ, వ్యూహాత్మక నియంత్రణ, నాటో ప్రభావాన్ని అడ్డుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశ్యాలు అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ దాడులు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి?
తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్, ఖార్కివ్, డోనెట్స్‌క్ వంటి ప్రాంతాల్లో దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: