हिन्दी | Epaper

Russia: పుతిన్ సమక్షంలోనే ఓ జర్నలిస్ట్ స్నేహితురాలికి పెళ్లి ప్రపోజ్

Saritha

క్రీడాకారులు ప్లే గ్రౌండ్ లో సీరియస్ గా ఆడుతున్నప్పుడు లేదా ఆట ముగిసిన తర్వాత సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, పెళ్లి ప్రపోజ్ చేస్తుంటారు. లేదా పబ్లిక్ మీటింగ్ సమయంలోను, ఇతర స్థలాల్లోనూ తమను పెళ్లాడాలని స్నేహితులను, ప్రియురాళ్లను కోరడం సహజంగా మనం చూస్తుంటాం. (Russia) అలాంటి ఏకంగా దేశాధినేత ప్రెస్ మీటింగ్ లో ఓ జర్నలిస్ట్ తన స్నేహితురాలిని పెళ్లాడమని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనుకోని ఘటన

సెలబ్రిటీలు వెరైటీగా స్నేహితులకు ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. (Russia) క్రీడాకారులైతే స్టేడియంలో సినీ నటులైతే వేదికలపై తమ మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక జర్నలిస్టు పుతిన్(Putin) ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉండగా స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది చివరలో పుతిన్ ఎప్పుడూ విలేకర్ల సమావేశం పెడుతుంటారు. మీడియా సమావేశం లైవ్ జరుగుతుండగా ఓ యువ జర్నలిస్ట్ కిరిల్ బజనోవ్ (23) లేచి తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఎర్రటి బో టై ధరించి.. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్నాడు. దీంతో హాల్ లో జరుగుతున్న విలేకర్ల సమావేశం కాస్త శృంగారభరితంగా మారిపోయింది.

Read also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..

Russia: పుతిన్ సమక్షంలోనే ఓ జర్నలిస్ట్ స్నేహితురాలికి పెళ్లి ప్రపోజ్

చప్పట్లతో మార్మోగిన సమావేశం

ఈ అరుదైన దృశ్యం పుతిన్ కంటపడింది. ఈ సందర్భంగా బజానోవ్.. ప్రియురాలి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ‘నా స్నేహితురాలు ఇప్పుడు ప్రెస్కాన్ఫరెన్స్ చూస్తోందని నాకు తెలుసు. ఒలెచ్కా నన్ను పెళిన్ల చేసుకో’ అంటూ ప్రపోజ్ చేశాడు. వెంటనే విలేకర్ల నుంచి నవ్వులు, హర ధ్వానాలు, చప్పట్లు మార్మోగాయి. ఈ సందర్భంగా పుతిన్ కూడా చప్పట్లు కొట్టడంతో మరోసారి చప్పట్లతో హాలు దద్దరిల్లింది. ప్రతిస్పందనతో ఉత్సాహంగా ఉన్న బజనోవ్ రష్యా అధ్యక్షుడిని నేరుగా ఉద్దేశించి.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. మా వివాహ వేడుకలో మిమ్మల్ని చూడటానికి మేం చాలా సంతోసిస్తాం’ అని అన్నాడు. పుతిన్ మాత్రం ఆహ్వానాన్ని తిరస్కరించారు. మొత్తానికి బజనోవ్ స్నేహితురాలు పెళ్లి ప్రతిపాదనను అంగీకరించినట్లుగా కథనాలు పేర్కొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

📢 For Advertisement Booking: 98481 12870