हिन्दी | Epaper

పగ తీర్చుకుంటా: షేక్ హసీనా

Sharanya
పగ తీర్చుకుంటా: షేక్ హసీనా

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను వదలబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర ఏదీ మర్చిపోదని తప్పక ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. చరిత్రను చెరిపేయడం ఎవరి వల్లా కాదన్నారు. బంగ్లాదేశ్, అక్కడి ప్రజల కోసం తానేమీ చేయలేదా? అని క్వశ్చన్ చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు షేక్ హసీనా ఎందుకింత సీరియస్ అయ్యారు? బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? మాజీ ప్రధాని ఒక్కసారిగా గరంగరం అవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

1722914508 8401

అన్నిబ్యాన్ చేయాలి !
షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ తరుణంలోనే ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటికి నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. షేక్ హసీనా అధ్యక్షురాలిగా ఉన్న ఆవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించాలంటూ కొందరు విద్యార్థులు ఢాకాలోని ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటిపై దాడికి దిగారు. అద్దాలను పగులుగొట్టి ఇంట్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి మొత్తం సామాగ్రిని ధ్వంసం చేశారు. అంతేగాక ఆ ఇంటికి నిప్పంటించారు.

చరిత్ర ఏదీ మరిచిపోదు !

షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటికి నిప్పంటించిన ఘటనపై షేక్ హసీనా సీరియస్ అయ్యారు. చరిత్ర ఏదీ మరిచిపోదన్నారు. ఇంటిని ధ్వంసం చేయగలరేమో గానీ చరిత్రను మాత్రం చెరపలేరన్నారు. కాగా, షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ పాకిస్థాన్ నుంచి బంగ్లాను విముక్తి చేయడంలో, స్వాతంత్య్ర పోరాటంలో విశేషంగా కృషి చేశారు. అయితే 1971లో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడగా. ఆ తర్వాతి ఏడాది ఢాకాలోని నివాసంలో ఆయనను హత్య చేశారు. దీంతో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు షేక్ హసీనా. ఇప్పుడు అదే ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్

మోజ్తబా ఖమేనీ- 17 ఏళ్ల వ్యూహం, ఇరాన్ సుప్రీం లీడర్

కుప్పకూలిన అమెరికా విమానం

కుప్పకూలిన అమెరికా విమానం

రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికాకు మొజ్తబా ఖమేనీ అల్టిమేటం

రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికాకు మొజ్తబా ఖమేనీ అల్టిమేటం

📢 For Advertisement Booking: 98481 12870