వలసదారులకు ఉద్దేశించిన గోల్డ్ కార్డ్ సేవలను ప్రారంభించే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా లాంటి దేశాల విద్యార్థులు అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులైన తర్వాత స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుండటం సిగ్గుచేటు అని ఆయన కామెంట్ చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి, వర్సిటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చే వారిని అమెరికాలోనే నిలుపుకునేందుకు గోల్డ్ కార్డ్ దోహదపడుతుందని తెలిపారు. విదేశాలకు చెందిన ప్రతిభావంతులను నియమించుకోవడానికి, వారిని ఇక్కడే నిలుపుకోవడానికి ఈ కార్డు వీలు కల్పిస్తుందని ట్రంప్ చెప్పారు.వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పక్కనే ఐబీఎం భారత సంతతి సీఈఓ అరవింద్ కృష్ణ, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ కూర్చున్నారు.
Read Also: Satya Nadella: లక్షలాది మంది భారతీయులకు ఏఐపై నైపుణ్య శిక్షణ ఇస్తాం: సత్యా నాదెళ్ల

స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి
“అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం ఒక బహుమతి. ఎందుకంటే వాళ్లు అమెరికాలో ఉండదగిన గొప్ప వ్యక్తులు అని మేం భావిస్తున్నాం. కానీ కొన్ని దేశాల వాళ్లు అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువు పూర్తయ్యాక, స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే వారిలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. స్థానిక ప్రతికూలతల వల్ల, పట్టా చేతికొచ్చాక అమెరికాలో ఉండటాన్ని వాళ్లు కష్టంగా ఫీలవుతున్నారు. మన వర్సిటీల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోతుండటం సిగ్గుచేటు, హాస్యాస్పదమైన విషయం. మేం ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం” అని ట్రంప్ తెలిపారు.
ఇకపై ఈ సమస్య ఉండదు: ట్రంప్
“అమెరికాలోని టాప్ యూనివర్సిటీల విద్యార్థులను నియమించుకున్నా, వాళ్లు ఉద్యోగంలో కొనసాగుతారో లేదో నిర్దిష్టంగా చెప్పలేమని నాతో చాలాసార్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. ఈ లెక్కన మన వర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులను దేశం బయటికి తరిమేస్తున్నాం. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులంతా కెనడా సహా ఇతరత్రా దేశాలకు వెళ్లిపోతున్నారు. అమెరికా వర్సిటీల్లో ప్రతిభ కనబర్చే విద్యార్థులను ఇక్కడే నిలుపుకునే మార్గం లేకపోవడం వల్లే ఇప్పటిదాకా ఇలా జరిగింది. ఇకపై ఈ సమస్య ఉండదు.
Read hindi news : http://hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: