ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపునకు గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని, శాంతి చర్చలు ఫలప్రదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, పరిష్కారం దూరంలో లేదని తెలిపారు.”జెలెన్స్కీ, పుతిన్ ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించుకుంటున్నారు. అది చర్చలను క్లిష్టం చేస్తోంది. అయినా కూడా మేం ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామని భావిస్తున్నాను. యుద్ధాన్ని ముగించే మంచి అవకాశం ఉంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. నాలుగేళ్లకు చేరువవుతున్న ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం కీలకంగా మారింది.
Read Also: Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

దాడులు మానవతా విపత్తుకు దారి
తీవ్రమైన శీతాకాల పరిస్థితుల కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఇతర పట్టణాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని తాను పుతిన్‌ను వ్యక్తిగతంగా కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. “ఒక వారం పాటు కాల్పులు ఆపాలని నేను పుతిన్‌ను అడిగాను. చాలా మంది ఇది సాధ్యం కాదన్నారు. కానీ ఆయన అంగీకరించారు. ఇది మంచి సంకేతం” అని చెప్పారు. ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న చలి అసాధారణమని, ఇలాంటి వాతావరణంలో దాడులు మానవతా విపత్తుకు దారి తీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే నేలమీద పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా ప్రాంతంలో రష్యా డ్రోన్ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మరోవైపు రష్యా పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతోందని జెలెన్స్కీ హెచ్చరించారు. ఈ పరిణామాలు శాంతి చర్చలకు సవాలుగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో త్వరలోనే కీలక శాంతి చర్చలు జరగనున్నాయి. వారాంతంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: