అమెరికా (America) తాజాగా రష్యాపై విధించిన ఆంక్షలు అంతర్జాతీయ రాజకీయ వాతావరణాన్ని మళ్లీ కుదిపేశాయి. ఈ ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్పందించారు. ఈ చర్యలతో అమెరికా ఒకవైపు స్నేహపూర్వకత చూపుతూ, మరోవైపు ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగదని, తాము ఇప్పటికే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు.
California: కాలిఫోర్నియాలో ట్రక్కు ప్రమాదం
అయితే, తన వ్యాఖ్యల్లో పుతిన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. “ఎవరైనా రష్యా (Russia) పై క్షిపణి దాడి చేసే సాహసం చేస్తే, వారి ప్రతిస్పందన భరించలేనిది అవుతుంది. రష్యా సైనిక శక్తిని తక్కువ అంచనా వేయకండి” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రపంచ శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసాయి.
రష్యాకు చెందిన రెండు ప్రధాన చమురు సంస్థలు
బుధవారం అమెరికా ప్రభుత్వం రష్యాకు చెందిన రెండు ప్రధాన చమురు సంస్థలు రోస్‌నెఫ్ట్ (Rosneft) మరియు లుకాయిల్ (Lukoil)పై ఆంక్షలు విధించింది. ఈ రెండు సంస్థలు రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ వనరులు కావడంతో, ఈ ఆంక్షలు చమురు మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రష్యాపై ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.తన పదవీకాలం ప్రారంభంలో రష్యాతో సత్సంబంధాలు నెరపాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే, కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోవడంతో ట్రంప్ అసహనానికి గురయ్యారు.
ఆంక్షలు విధించినప్పటికీ
పుతిన్ (Vladimir Putin) తో బుడాపెస్ట్‌లో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశం కూడా రద్దు కావడంతో ఆయన సహనం కోల్పోయి తాజా ఆంక్షలకు ఆదేశించారు.అయితే, ఆంక్షలు విధించినప్పటికీ చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని పుతిన్ సంకేతాలిచ్చారు. “వివాదాలు, ఘర్షణల కంటే చర్చలే మేలు.
మేం ఎప్పుడూ చర్చల కొనసాగింపునే కోరుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉక్రెయిన్ కోరుతున్నట్లు అమెరికా టోమాహాక్ క్షిపణులతో తమపై దాడి చేస్తే మాత్రం తమ ప్రతిస్పందన చాలా బలంగా, తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: