ఒకపక్క ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చైనా పర్యటనలో ఉండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం నుంచి భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. పుతిన్ (Putin)భారత పర్యటనను పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ రెండు దేశాల సంబంధాలతో అవి కొంచెం ఆందోళన చెందుతున్నట్లు కూడా కనిపిస్తున్నాయి. భారతదేశంలోని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దౌత్యవేత్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంయుక్తంగా రాసిన ఒక వ్యాసం డిసెంబర్ 1న ప్రచురితమైంది. యుక్రెయిన్ యుద్ధాన్ని సాగదీస్తున్నారంటూ ఈ వ్యాసంలో వారు రష్యాపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అదే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాశారు. యుక్రెయిన్ యుద్ధం గురించి ఈ కథనం భారతీయులను ‘తప్పుదారి పట్టించేది’గా ఉందని అభిప్రాయపడ్డారు.
Read Also: Putin: పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

అంతర్జాతీయ సంస్థలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం
“రెండు దేశాలు దీర్ఘకాల స్నేహాన్ని, వ్యూహాత్మక సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం కూడా స్థిరంగా కొనసాగుతోంది. న్యూదిల్లీలో జరిగే చర్చల అజెండా ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడిని మనం ఎలా తట్టుకోగలం అన్న అంశం మీదే ఉంటుంది” అని ప్లాట్నికోవ్ అన్నారు. అమెరికా ఆంక్షలను తట్టుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ చాలా వరకు తగ్గించిందని కొన్ని రిపోర్టులు వచ్చినప్పటికీ, దీని వల్ల ఇండియాకు ఇప్పటికీ ప్రయోజనాలు ఉన్నాయని ప్లాట్నికోవ్ అంటున్నారు. ”భారత దిగుమతుల్లో రష్యా చమురుకు గణనీయమైన వాటా ఉంది. దానిని కొనడం ద్వారా భారతదేశం మంచి లాభాలను ఆర్జిస్తోంది. ప్రభుత్వ ఖజానాను నింపడానికి అవకాశం కల్పించే ఇలాంటి ‘ప్రాఫిటబుల్ ఆఫర్’ను ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు?” అని ప్లాట్నికోవ్ అన్నారు. అయితే, కేవలం చమురే కాకుండా, ఇతర రంగాలలో కూడా మంచి భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరికొందరు నిపుణులు అంటున్నారు.
రష్యాలో భారతీయులకు మంచి డిమాండ్
“రష్యాలో భారతీయులకు మంచి డిమాండ్ ఉంది. సెమీ స్కిల్డ్ కార్మికుల అవసరం దేశానికి ఉంది. రష్యాకు ఐదు లక్షలమంది భారతీయ కార్మికులు కావాల్సి రావొచ్చు” అని ‘ది హిందూ’ తో మాస్కోకు చెందిన విశ్లేషకుడు ఆరిఫ్ అసాలియోగ్లు అన్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడిని ఎదుర్కోవడంలో చైనా, భారత్‌ల మద్దతు రష్యాకు ఎంతో కీలకంగా మారిందని అసాలియోగ్లు అన్నారు. ఆగస్ట్ నెలాఖరులో భారత్, చైనా, రష్యా నేతలు టియాంజిన్‌లో సమావేశమైనప్పుడు, బహుళ ధ్రువ ప్రపంచం అనే అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చింది. భారతదేశం దశాబ్దాలుగా అలీన విధానాన్ని అనుసరిస్తోంది. కానీ, అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా వైపు నిలబడాలన్న ఒత్తిడి భారత్‌పై పెరిగింది. ‘ది న్యూ రైజింగ్ పవర్స్ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్’ రచయిత, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై నిపుణుడు జోరావర్ దౌలత్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ భారతదేశం న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోందని అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: