భారత్–రష్యా సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) డిసెంబర్ తొలి వారంలో భారత్ పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారత నిపుణులు మరియు నైపుణ్య కార్మికులకు దాదాపు 70,000 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రష్యా ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక దేశంగా ఎదుగుతోంది. నిర్మాణ, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో నైపుణ్య సిబ్బంది కొరత ఉండడంతో, భారతీయుల సేవలను కోరుకుంటోంది. ఈ కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే, రష్యాలో పనిచేస్తున్న భారతీయుల హక్కులు చట్టపరమైన రక్షణ పొందుతాయి.
Read also: Trump Tariffs : భారత్ పై టారిఫ్లు తగ్గిస్తాం – ట్రంప్ ప్రకటన

Putin: 70,000 మంది భారతీయులకు రష్యాలో ఉద్యోగావకాశాలు
భారతీయుల సమస్యలు పునరావృతం కాకుండా
అదేవిధంగా, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పారదర్శకంగా ఉంచే దిశగా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని హర్షించింది. “భారతదేశం అత్యంత ప్రతిభావంతమైన మానవ వనరులు కలిగిన దేశం. రష్యా ప్రస్తుత దశలో ఇలాంటి నైపుణ్య కార్మికులు అత్యవసరం. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ లాభదాయకం అవుతుంది,” అని ఐబీఏ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ పేర్కొన్నారు. గతంలో నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేత మోసపోయిన భారతీయుల సమస్యలు పునరావృతం కాకుండా, ఐబీఏ ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: