Pushpak Tanker: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణా తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం మూసివేతతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
Read Also:Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!
నిలిచిపోయిన వందల నౌకలు

సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం తొమ్మిది నౌకలు మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటగలిగాయి. అందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ అనే ట్యాంకర్ కూడా ఉంది. ఈ నౌక పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌కు తీసుకువస్తోంది. పుష్పక్’ ట్యాంకర్ భారత్‌కు చేరుకోవడంతో దేశంలో ఇంధన నిల్వలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే జలసంధిపై కొనసాగుతున్న ఆంక్షలు ప్రపంచ చమురు సరఫరాపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: