రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
Read Also: India: పుతిన్ విలాసవంతమైన జీవన విధానం
రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు
ఈ సదస్సులో పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆర్థికం, ఆరోగ్యం, అకాడమిక్స్, సంప్రదాయం, మీడియా రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కూడా పుతిన్ (Vladimir Putin) ను రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక స్వాగతం పలకనున్నారు.

చివరిసారిగా పుతిన్ 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆయన మరోసారి భారత్‌లో అడుగుపెట్టారు. ఇరుదేశాధినేతలు ఎలాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: