అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెక్ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసా (H-1B visa) విధానంలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత వీసా జారీ విధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, 2026 ఫిబ్రవరి నాటికి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
Dismissal of Govt : USలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!
కేవలం చౌకగా లభించే టెక్ నిపుణులను దేశంలోకి తీసుకురావడానికే ఈ వీసాలు అన్న అభిప్రాయం సరికాదని ఆయన అన్నారు.‘న్యూస్‌నేషన్’ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ లుట్నిక్ పలు కీలక విషయాలు వెల్లడించారు. “ప్రస్తుత హెచ్-1బీ విధానం లోపభూయిష్టంగా ఉంది.
అత్యంత నైపుణ్యం కలిగిన వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీసాదారులతో దేశం నిండిపోకుండా ఉండాలంటే లక్ష డాలర్ల ఫీజు విధించినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.

హెచ్-1బీ వీసాల్లో సుమారు 74 శాతం టెక్ నిపుణులకే
ప్రస్తుతం జారీ అవుతున్న హెచ్-1బీ వీసాల్లో సుమారు 74 శాతం టెక్ నిపుణులకే వెళ్తున్నాయని, అయితే డాక్టర్లు, విద్యావేత్తల వంటి ఇతర కీలక రంగాల నిపుణుల (Sector experts) వాటా కేవలం 4 శాతంగానే ఉందని లుట్నిక్ వివరించారు. దేశానికి ఉన్నత డిగ్రీలు కలిగిన డాక్టర్లు, విద్యా నిపుణుల అవసరం ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ కంపెనీలకు ఇంజనీర్లు మాత్రమే కావాలనుకుంటే, అధిక జీతాలు పొందే అత్యుత్తమ నిపుణులను మాత్రమే నియమించుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: