POK : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో నేడు పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంది. పీవోకే రాజధానిగా చెప్పబడుతున్న ముజఫరాబాద్ వైపు నిరసనకారులు నేడు ర్యాలీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారు పాకిస్థాన్ అసెంబ్లీ నంచి స్వాతంత్ర్యం ప్రకటించుకునే అవకాశం ఉంది. పీవోకేలోని రావల్కోట్‌లో నిరసన జరుగుతున్న వీడియోలలో వేలాది మంది ప్రజలు కనిపించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది చిన్నారులు కూడా పాల్గొంటున్నారు. వోకేలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి యూనిఫాంలో రావల్కోట్‌లోని ఈద్గా మైదానంలో గుమిగూడారు. వారు తెల్ల జెండాలను ఊపుతూ.. పీవోకేలో పాకిస్థాన్ సైన్యం క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. పిల్లలకు ఏమైనా జరిగితే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) బాధ్యత వహించాల్సి ఉంటుందని పాకిస్థాన్ అధికారులు ఆదివారం హెచ్చరించారు.
Read Also: Donald Trump: ఇరాక్‌కు గుడ్‌బై చెప్పనున్న అమెరికా సైన్యం.. ట్రంప్ కీలక ప్రకటన

POK : పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ
పాకిస్థాన్ అసెంబ్లీ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంటుందా? జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) నేడు ముజఫరాబాద్‌కు పాదయాత్రను ప్రకటించింది. అందుకే ర్యాలీలో వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారు. నిరసనకారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ముజఫరాబాద్ వైపు పాదయాత్ర ప్రారంభించారు. 3 రోజుల క్రితం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్థాన్ అసెంబ్లీ నుంచి స్వాతంత్ర్యం కోరతామని పేర్కొంది. ఈ లోగా యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ(యూకేపీఎన్పీ) ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు, నిర్బంధాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ సమాజ నాయకులు, పాత్రికేయులు, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, బలప్రయోగాన్ని ఆపాలని డిమాండ్ చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :