PM Modi Putin : షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, (PM Modi Putin) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి వచ్చి మాట్లాడారు. ముగ్గురూ చేతులు కలిపి స్నేహపూర్వకంగా చర్చించగా, పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ మాత్రం పక్కన నిలబడి ఉన్నట్లు కనిపించారు.
తర్వాత మోదీ, పుతిన్ కలిసి నడుస్తూ హత్తుకున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడ్డాయి.
మోదీ తన ఎక్స్ ఖాతాలో పుతిన్, షీ జిన్‌పింగ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, సమావేశంలో జరిగిన చర్చల గురించి తెలిపారు.
Read also :