అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు మరోసారి భారత్–అమెరికా సంబంధాలను చర్చనీయాంశంగా మార్చాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ, “భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి అంగీకరించారు” అని ప్రకటించగా, ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అయితే, భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి ఎటువంటి ఫోన్ సంభాషణ ఇద్దరు దేశాధినేతల మధ్య జరగలేదని స్పష్టం చేసింది.
Read Also: Johnson’s Company:జాన్సన్ కంపెనీ బేబీ పౌడర్ సంస్థపై కోట్లకు దావా
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) స్పష్టం చేశారు. ఈ విషయంపై భారత్ ఇదివరకే ఒక స్పష్టతనిచ్చిందని ఆయన తెలిపారు.రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు నరేంద్ర మోదీ (PM Modi) అంగీకరించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది.ఇదివరకే కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశ ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమని, వీటి ఆధారంగానే దిగుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా నుంచి చమురు దిగుమతులు పెంచడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఈ విషయంలో చాలా పురోగతి కనిపించిందని ఆ ప్రకటనలో పేర్కొంది.

అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా భారత్ స్పందించింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ కేంద్రంగా మారిందని ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని మండిపడింది.
తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిందని విమర్శించింది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్ పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: