భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండురోజుల జోర్డాన్ పర్యటన ఇరుదేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్ లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా-2తో ప్రధాని జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఫలితంగా 5 కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
Read Also: US: వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

జోర్డాన్ కంపెనీలకు మోదీ ఆహ్వానం
పునరుత్పాదక ఇంధనం, కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారం కోసం ఇరుదేశాలు అంగీకరించాయి. ఇది స్వచ్చమైన ఇంధన వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది. నీటి సంరక్షణ, యాజమాన్యం, అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారతదేశంలో విజయవంతమైన ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‘ జోర్డాన్ లోనూ అమలు చేసేలా సాంకేతికతను పంచుకోవాలని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు.
2025 నుంచి 2029 వరకు సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచేందుకు గతంలో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఇంకా ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన జోర్డాన్ లోని ‘పెట్రా’, భారత్ లోని(PM Modi) ఎల్లోరా గుహల మధ్య పర్యాటక, వారసత్వ సంరక్షణ కోసం ‘ట్విన్నింగ్’ ఒప్పందం కుదిరింది. జోర్డాన్లో 17,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి సహకారాన్ని మోదీ అభినందించారు. ‘భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరం’లో ప్రసంగించిన ప్రధాని, భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు కావాలని జోర్డాన్ కంపెనీలను ఆహ్వానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: