PM Modi Japan Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల జపాన్-చైనా పర్యటనను ప్రారంభించారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత టోక్యోకు చేరుకున్న PM Modi Japan Tour మోదీకి గాయత్రీ మంత్రం, భజనలతో ఘన స్వాగతం లభించింది.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో సమావేశమై వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపారు.
టోక్యోలో జరిగిన 15వ ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్లో మోదీ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ద్వైపాక్షిక స్నేహానికి కీలకమని పేర్కొన్నారు.
జపాన్ మీడియా నివేదికల ప్రకారం, రానున్న దశాబ్దంలో జపాన్ భారతదేశంలో 10 ట్రిలియన్ యెన్ (₹68 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడులు ఆటోమొబైల్స్, బ్యాటరీలు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్, అణుశక్తి, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున పెరగనున్నాయి.
మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైలు కోచ్ తయారీ కేంద్రంను కూడా సందర్శించనున్నారు. భారత్-జపాన్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై చర్చలు జరగనున్నాయి.
అదే విధంగా, రెండు దేశాలు భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటనను సవరించనున్నాయి. ఆర్థిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనే కొత్త ద్వైపాక్షిక సహకార చట్రంను కూడా ప్రారంభించనున్నారు.
జపాన్ పర్యటన అనంతరం, ప్రధాని మోదీ చైనాలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
Read also :