దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తాజా G20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొని, సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.G20 సదస్సు (G20 Summit 2025) లో “అందరికీ న్యాయమైన భవిష్యత్తు” అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.
Read Also: Modi Meloni Meet: ద్వైపాక్షిక అంశాలపై మోదీ–మెలోని చర్చలు వేగం అందుకున్నాయి
టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో “సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ” అనే నినాదంతో భారత్ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు ఆతిథ్యం ఇవ్వనుందని, ఈ సదస్సులో పాల్గొనాలని G20 దేశాలను ఆహ్వానించారు.
కృత్రిమ మేధ (AI) విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని నొక్కి చెప్పారు.సదస్సు నిర్వాహక దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్‌కు చీతాలను తరలించినందుకు రమఫోసాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటలీతో కలిసి సంయుక్త కార్యాచరణకు అంగీకరించారు
2026లో బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించనుండగా, తమ పూర్తి మద్దతు ఉంటుందని రమఫోసా హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో ఇటలీ, కెనడా, జపాన్ ప్రధానులతోనూ మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించేందుకు ఇటలీతో కలిసి సంయుక్త కార్యాచరణకు అంగీకరించారు.
కెనడాతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. జపాన్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశాల ద్వారా కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: