మనిషి ఆలోచనలకూ విలువ ఉంటుందా? జపాన్‌లోని టోక్యో నగరంలో ఈ ప్రశ్నకు వినూత్నంగా సమాధానం ఇస్తోంది ఓ సంస్థ. ‘బ్రెయిన్‌వేవ్ టు ది క్రియేషన్’ (‘Brainwave to the Creation’) పేరుతో నడుస్తున్న సంస్థ, మన మెదడులో వచ్చే ఆలోచనల తరంగాలనే కళారూపాల్లోకి మార్చేస్తోంది. వినడానికి అద్భుతంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జపాన్ (Japan)లో సంచలనంగా మారింది.టోక్యోలోని చియోడా జిల్లాలో ఉన్న BWTC మెటావర్స్ స్టోర్‌కి వెళ్లి, కేవలం 100 సెకన్లపాటు మెదడును స్కాన్ చేయించుకుంటే చాలు – కంపెనీ రూ. 590 (1,000 జపనీస్ యెన్) చెల్లిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తలపై ఒక ప్రత్యేక పరికరాన్ని పెట్టుకుని ఆ స్కానింగ్‌కి సహకరిస్తే, వారి ఆలోచనలను కంపెనీ డేటాగా మార్చుకుంటుంది.
ఆర్ట్‌గా మారుతున్న మెదడు సంకేతాలు
సేకరించిన బ్రెయిన్‌వేవ్ డేటాను కంపెనీ తక్షణమే ఒక డిజిటల్ ఆర్ట్‌గా రూపుదిస్తుంది. వ్యక్తి ఆలోచించిన అంశం, స్కానింగ్ సమయంలో ఉన్న మానసిక స్థితి ఆధారంగా ప్రత్యేకమైన కళాఖండాలు రూపొందుతాయి. వీటిని ప్రదర్శనకు పెట్టి విక్రయిస్తారు. ఒక్కో ఆర్ట్‌కు ప్రత్యేక ధర ఉంటుంది.
ఆలోచనల విలువ ఆధారంగా ధరలు
ఒక వ్యక్తి ట్రామ్ వీడియో చూస్తుండగా చేసిన స్కానింగ్‌తో వచ్చిన ఆర్ట్‌కు రూ. 8,201 పలికింది. మరో వ్యక్తి ఆహారంపై ఆలోచిస్తుండగా వచ్చిన ఆర్ట్‌కు రూ. 4,608 ధర వచ్చిందట. ఇలా ఒక్కో ఆలోచనకు, ఒక్కో కళాఖండానికి ప్రత్యేక విలువ లభిస్తోంది.
భవిష్యత్ ఆర్ట్ మార్కెట్‌కి దారి
ఇప్పటికే BWTC సంస్థ 1,853 మందికి పైగా ప్రజల మెదడు తరంగాలను సేకరించిందని వెల్లడించింది. టోక్యోతో పాటు తైవాన్‌లోనూ ఈ ప్రాజెక్టు పెద్ద విజయాన్ని సాధించింది. భవిష్యత్‌లో మన భావోద్వేగాలే డిజిటల్ మార్కెట్లో కొత్త ఆస్తులుగా మారే అవకాశం ఉంది.
Read Also : Virender Sehwag : డీపీఎల్ వేలంలో సెహ్వాగ్ కొడుకు, కోహ్లీ అన్న కొడుకు…