పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imaran khan) గూర్చి ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా కుమారుడు ఖాసిం ఖాన్ ఆరు వారాలుగా తండ్రిని చూడలేదని, మాట్లాడడం కూడా అనుమతించలేదని చెబుతున్నారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ జైలు అధికారులు కలిసే అవకాశం ఇవ్వకపోవడం, ఫోన్ కాల్స్ కూడా నిరోధించడం వల్ల ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.
Read also: Hongkong: ఇంకా ఆరని మంటలు.. 94 కు చేరిన మృతులు!

What happened to Imran Khan?
ఇమ్రాన్ బతికే ఉన్నారా అన్న పుకార్లు
పాకిస్తాన్ అంతటా ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం ఒక చిన్న ప్రకటన తప్ప ఏ ఆధారమూ బయటపెట్టలేదు. ఆయన వీడియో, తాజా ఫోటో లేదా ఆరోగ్యంపై స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ బతికే ఉన్నారా అన్న పుకార్లు గట్టిపడుతున్నాయి. జైలు వద్ద ఆందోళన చేసిన ఆయన సోదరీమణులకు పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి.
ఇదిలావుంటే బలూచిస్థాన్ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, ఐఎస్ఐ అధికారి ఇమ్రాన్ మరణానికి కారణమని ఆరోపించడం మరో సంచలనం రేపింది. తండ్రి భద్రతను నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఖాసిం ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారన్న ఆధారాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: