భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్‘ యుద్ధాన్ని తానే ఆపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్న విషయం మనకు విధితమే. తాజాగా ట్రంప్ చేసిన వాదనలను పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దార్ పరోక్షంగా తోసిపుచ్చారు. శాంతి చర్చల్లో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ట్రంప్ చేస్తున్న ప్రకటనల డొల్లతనాన్ని బయటపెట్టాయి. అల్ జజీరా మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో(interview) దార్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ సంబంధాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, మధ్యవర్తిత్వం కోసం భారత్లో ఏమైనా సంప్రదింపులు జరిగాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన తప్పుబట్టారు. ‘మూడవ పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించదు. ఇది వారి అంతర్గత వ్యవహారంగా వారు భావిస్తారు’ అని దార్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ వాదనలకు పాకిస్తాన్ కూడా మద్దతు పలకడం లేదని స్పష్టమైందది.

పదేపదే చెప్పుకుంటున్న ట్రంప్
గత కొంతకాలంగా, ట్రంప్ భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో తన పాత్ర ఉందని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆయన ఈ ఒప్పందం తన ‘వ్యాపార ఒత్తిడి’ వల్లే సాధ్యమైందని, లేకపోతే యుద్ధం జరిగేదని వాదిస్తున్నారు.
మోదీ, జైశంకర్ తిరస్కరణ
ట్రంప్ వాదనలను భారత్ పదేపదే తిరస్కరిస్తూ వచ్చింది. ప్రధాని మోదీ భారత్-పాకిస్తాలమధ్య ఉద్రిక్తతలు రెండు దేశాల ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని, యుద్ధ విరమణ నిర్ణయానికి వచ్చామని, ఇందులో ట్రంప్ పాత్ర ఏమీ లేదని చెప్పారు. విదేశీవ్యవహారాల మంత్రి జైశంకర్ కూడా ఇదే విషయాన్ని ఖండిస్తూ వచ్చారు. పైగా ట్రంప్ తాను ఆరు దేశాలమధ్య యుద్ధాలను ఆపానని, ఇందులో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధం కూడా ఒకటని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, దానికి తాను అర్హుడునని కూడా ట్రంప్ పలుమార్లు చెప్పుకున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఎవరు స్పందించారు?
పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ స్పందించారు.
ఇషాక్ దార్ ట్రంప్ వ్యాఖ్యలపై ఏమన్నారు?
ట్రంప్ చెప్పింది అబద్ధమని, అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: