ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో భారత్, పాక్‌ల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామన్న చైనా వాదనను తాజాగా పాకిస్థాన్ సమర్థించింది. చైనా శాంతి కోసం దౌత్యం చేసిందని కితాబు ఇచ్చింది. “భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో చైనా నిరంతరం పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరిపింది. ముఖ్యంగా మే 6 నుంచి 10వ తేదీ వరకు మాతో టచ్‌లో ఉంది. బహుశా ఈ ఘర్షణలకు ముందు, ఆ తరువాత కూడా భారత్‌తో చైనా సంప్రదింపులు చేసింది. కనుక చాలా సానుకూల వాతావరణంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో చైనా కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో శాంతి, భద్రతను కాపాడడానికి చైనా దౌత్యం దోహదపడిందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో చైనా చెప్పిన మాటలు పూర్తిగా సరైనవని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అండ్రాబి శనివారం చెప్పారు.
Read Also: Kim Ju Ae: బాహ్య ప్రపంచానికి మళ్లీ కనిపించిన కిమ్ గారాలపట్టి

మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఒక సింపోజియంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వాఖ్యలు చేశారు. 2025లో చైనా మధ్యవర్తిత్వం వహించిన అంతర్జాతీయ రాజకీయ ఉద్రికత్తల జాబితాలో భారత్, పాక్ ఘర్షణ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు, తాహిర్ నిజమేనని తాజాగా వంతపాడారు. గతేడాది మే నెలలో పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణను ఇరుదేశాల సైన్యాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్స్ (డీజీఎంవో) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే పరిష్కరించుకున్నామని భారత్ ఇది వరకే స్పష్టం చేసింది. ఇందులో మూడో పక్షం జోక్యానికి తావులేదని తేల్చిచెప్పింది.
భారత్ వివరణ ఇచ్చినప్పటికీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే (20 కంటే ఎక్కువ సార్లు) తాను భారత్-పాక్‌ల మధ్య ఘర్షణలను ఆపేశానని చెప్పుకుంటున్నారు. అయితే భారత్ దీనిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. స్పష్టంగా ఇండియా- పాక్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్‌ను ట్రంప్‌కు ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేసింది. భారత్ వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన మాత్రం ఈ విషయంలో తనకు తాను క్రెడిట్ ఇచ్చుకుంటునే ఉన్నారు. అయితే ఇంతకు ముందు పాకిస్థాన్ ట్రంప్ మాటలకు వంతపాడింది. తాజాగా చైనా కూడా ఘర్షణలను ఆపేందుకు సహకరించిందని చెప్పడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: